మహిళా సంఘాలు కోట్లాది విత్తన బంతులు తయారుచేస్తున్నాయి. కొందరికి ఇది కొత్తగా ఆదాయవనరుగా మారి ఆసరాగా నిలిచింది. తయారుచేసిన విత్తన బంతుల్ని అటవీప్రాంతాల్లో ఆ శాఖ డ్రోన్ల ద్వారా చల్లిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో యువ బృందాలూ కార్యక్రమంలో పాలుపంచుకోవటం శుభ పరిణామం.
గిన్నిస్‌లో చోటుకు పాలమూరు ప్రయత్నం
మహిళా సంఘాల భాగస్వామ్యంతో పాలమూరు జిల్లాలో 9 రోజుల్లోనే 1.12 కోట్ల విత్తనబంతులు (సీడ్‌బాల్స్) తయారుచేసి చల్లారు. 284 గ్రామాలు, 5,880 మహిళా సంఘాలు, 69,220 మంది మహిళలు వీటి తయారీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మర్రి, రావి, మేడి, సీతాఫలం, వేప, చింత, జువ్వి తదితర విత్తన బంతులను 3 డ్రోన్లతో జిల్లావ్యాప్తంగా అడవులు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో చల్లారు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు’కు దరఖాస్తు చేసుకున్నారు. దూరదృశ్య సమీక్ష ద్వారా ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ ప్రతినిధులకు జిల్లా కలెక్టరు ఎస్.వెంకట్‌రావు వివరించారు. చల్లినవాటిలో 53%-80% మధ్య విత్తనాలు మొలుకెత్తే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'