తెలంగాణ

telangana

ETV Bharat / state

వేరుశనగకు మద్దతు ధర కల్పించండి - వేరుశనగకు మద్దతు ధరను కల్పించండి

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కక వేరుశనగ రైతు అల్లాడుతున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతున్నాడు. వ్యాపారుల అడ్డగోలు దోపిడీకి తోడు... మార్కెట్​లో ధర తగ్గుదలతో తమ గోడును ఎవరికీ చెప్పాలో తెలియని దుస్థితిలో ఉన్నారు మహబూబ్​నగర్​కు చెందిన వేరుశనగ రైతులు.

వేరుశనగకు మద్దతు ధరను కల్పించండి

By

Published : Mar 12, 2019, 3:07 PM IST

Updated : Mar 12, 2019, 5:01 PM IST

వేరుశనగకు మద్దతు ధర కల్పించండి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీస మద్దతు ధర దక్కక వేరుశనగ రైతు అల్లాడుతున్నాడు. మొదట్లో క్వింటాకు 5 వేలకు పైగా దక్కిన మద్దతు ధర ఇవాళ రూ.4500 దాటడం లేదు. అంతర్జాతీయ మార్కెట్​లో ధర తగ్గుదల, నాణ్యత పేరిట వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆయిల్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతుకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Last Updated : Mar 12, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details