గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అక్కడి అధ్యాపకులు ఆకుకూరలతో దేశపటం రూపంలో హరిత భారతాన్ని రూపొందించారు.
ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం - Green India with vegetables in Jadcherla
72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ప్రభుత్వ కళాశాల వినూత్న ప్రయత్నం చేసింది. ఆరోగ్యం, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కూరగాయలతో హరిత భారతాన్ని రూపొందించారు.
ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం
గత డిసెంబర్ 31న దేశపటాన్ని గీసి అందులో మెంతులు, గోంగూర విత్తనాలు చల్లారు. తరవాతి రోజు నుంచి నీటిని అందిస్తూ ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణంపై స్పృహ కల్పించడానికి ఇలా హరిత భారతాన్ని రూపొందించామంటారు అధ్యాపకులు.
- ఇదీ చూడండి :జెండా పండుగకు ముస్తాబు చేసిన ప్రాంగణాలు