తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గానుగ నూనె కేంద్రం ప్రారంభం - GALLUP OIL

మహబూబ్​నగర్​ జిల్లా ముత్యాలంపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య  ఏర్పాటు చేసిన గానుగ నూనె కేంద్రాన్ని డీఆర్​డీఏ  పీడీ క్రాంతి ప్రారంభించారు. ఈ విధంగా స్వచ్ఛమైన నూనెలు తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు.

Gallup oil center OPENED BY DRDA PD IN MAHABUBNAGAR DISTRICT
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గానుగ నూనె కేంద్రం ప్రారంభం

By

Published : Dec 13, 2019, 4:33 PM IST

మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలం ముత్యాలంపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గానుగ నూనె కేంద్రాన్ని డీఆర్​డీఏ పీడీ క్రాంతి ప్రారంభించారు. గ్రామంలోని సూర్య భీమేశ్వరి మహిళా సమాఖ్య ఒక గ్రూపుగా ఏర్పడి కల్తీ లేని, పరిశుద్ధమైన నూనెను సహజ పద్ధతిలో గానుగ ద్వారా తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లభిస్తున్న నూనెల్లో కల్తీ కలవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు. కాబట్టి ఈ విధంగా స్వచ్ఛమైన నూనె తయారు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చన్నారు.

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గానుగ నూనె కేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details