గ్రామీణ పేద యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం మహబూబ్నగర్ జిల్లాలో కేపీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణకు వచ్చే వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ జ్యోతి, సర్పంచ్ విజయలక్ష్మితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు.