తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవరకద్ర పట్టణంలో ఉచిత అంబులెన్స్ సేవలు - హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఉచిత అంబులెన్స్ సేవలు

ఆపదలో ఉన్నవారిని సత్వరమే కోరిన ఆస్పత్రికి చేర్చేందుకు దేవరకద్ర పట్టణంలో ఉచిత అంబులెన్స్​ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొండ సూర్య ప్రతాప్ రెడ్డి జ్ఞాపకారం ఆయన తనయుడు ప్రశాంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు.

free ambulance start in devarakadra town in mahabubnagar
దేవరకద్ర పట్టణంలో ఉచిత అంబులెన్స్ సేవలు

By

Published : Aug 7, 2020, 7:24 PM IST

Updated : Aug 7, 2020, 8:14 PM IST

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మరేదాంట్లో లేదని కొండ ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో ఉచితంగా అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. హెల్పింగ్ హాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో తన తండ్రి కొండ సూర్య ప్రతాప్ రెడ్డి జ్ఞాపకార్థం దీన్ని ప్రారంభించారు.

పట్టణ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదంలో గాయాలైనవారు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వారికి సత్వరమే సేవలు అందిస్తాయన్నారు. స్థానిక తహసీల్దార్ జ్యోతి, సర్పంచ్ కొండ జయలక్ష్మి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను పట్టణవాసులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

ఇదీ చూడండి:ఎల్​ఐసీ అండతో ఎస్​ బ్యాంక్ జోరు

Last Updated : Aug 7, 2020, 8:14 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details