తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కాచెళ్లెల్ల ఆత్మహత్యాయత్నం... ముగ్గురికి సీరియస్ - charlapally

మహబూబ్​నగర్ జిల్లా చర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

అక్కాచెళ్లెల్ల ఆత్మహత్యాయత్నం... ముగ్గురికి సీరియస్

By

Published : Jun 27, 2019, 4:17 PM IST

పెళ్లి కాలేదన్న మనస్థాపంతో మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలో వెంకటయ్య దంపతులకు ఆరుగురు కుమార్తెలు. 5వ కుమార్తె రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. ఆచూకి కోసం వెతకగా... పరిచయమున్న వ్యక్తితో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఇక తమకు పెళ్లిళ్లు కావన్న మనస్థాపంతో పురుగుల మందు తాగి మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నాతికి పాల్పడ్డారు. విషయం గమనించి స్థానికులు జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కాచెళ్లెల్ల ఆత్మహత్యాయత్నం... ముగ్గురికి సీరియస్

ABOUT THE AUTHOR

...view details