తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడాదిలో ఎన్నో చట్టాలు, సంస్కరణలు: జితేందర్​ రెడ్డి - మహబూబ్​నగర్ జిల్లా వార్తలు

ప్రధాని నరేంద్ర మోదీ ఏడాదిలో ఎన్నో చట్టాలు, సంస్కరణలు తీసుకొచ్చారని మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్​ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నామని మహబూబ్​నగర్​లో చెప్పారు.

former mp jithender reddy on pothireddypadu in mahabubnagar district
ఏడాదిలో ఎన్నో చట్టాలు, సంస్కరణాలు: జితేందర్​ రెడ్డి

By

Published : Jun 11, 2020, 4:46 PM IST

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న వేళ... అన్నివర్గాల సంక్షేమాన్ని కాపాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్​ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నామని చెప్పారు. పోతిరెడ్డిపాడు వల్ల హైదరాబాద్ నగరానికి తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు, పార్టీలు చేయని ఎన్నో చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భాజపా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. త్రిఫుల్​ తలాక్​, ఆర్టికల్​ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట అన్ని వర్గాలను ఆదుకున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

ABOUT THE AUTHOR

...view details