తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓట్ల కోసమే జగన్​తో కేసీఆర్ దోస్తీ' - కేసీఆర్

హైదరాబాద్​లో ఉంటున్న ఆంధ్రా, రాయలసీమ ప్రజల ఓట్ల కోసమే కేసీఆర్​ పోత్తిరెడ్డిపాడు విషయంలో నోరు మెదపడం లేదని మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్​తో దోస్తి కడుతున్నారని మండిపడ్డారు.

Former MP Jitender Reddy criticized Pottireddipadu
Former MP Jitender Reddy criticized Pottireddipadu

By

Published : May 12, 2020, 4:43 PM IST

రానున్న జీహెచ్​ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం జగన్​తో దోస్తిీ చేస్తున్నారని భాజపా నేత మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి అన్నారు. ఆనాడు వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పోత్తిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని తోడుకుపోతే మండిపడిన కేసీఆర్​... ఇప్పుడు ప్రతిరోజు 88వేల క్యూసెక్కుల నీటిని తోడుకుపోయేందుకు జీవోను తీసుకువస్తే.. ఎందుకు మౌనంగా ఉన్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే పాలమూరు జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టులతో పాటు ఇంటింటికి నీరందించే మిషన్​ భగీరథ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.

ఏ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగిందని... దీనికి సంబంధించి ప్రధానితో పాటు సీడబ్ల్యూసీ, సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేవలం రానున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసం... హైదరాబాద్​లో ఉంటున్న ఆంధ్రా, రాయలసీమ ప్రజల ఓట్ల కోసం కేసీఆర్​ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండిఃహైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ABOUT THE AUTHOR

...view details