తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలోచన అదిరింది... మొక్కల నీటి కష్టం తీరింది

నీటి కష్టాన్ని అధిగమించేందుకు అన్నదాతలు ధీర్ఘంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక్కో శాస్త్రవేత్త అయిపోతారేమో అన్నట్టున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కాయకష్టం చేసి పండించిన పంట కోత దశలో ఎండలకు మాడిపోతుంటే అన్నదాత కల్లలో నీరింకిపోతోంది. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డి పల్లికి చెందిన ప్రతాప్​రెడ్డి అనే రైతు వాటర్​ బాటిళ్లకు సెలైన్​ పైపులు పెట్టి మొక్కలకు నీరందిస్తున్నాడు.

By

Published : Apr 25, 2019, 12:10 PM IST

వినూత్న ఆలోచనతో ఆకట్టుకున్న రైతు

మహబూబ్​నగర్​ జిల్లాలో గత మూడేళ్లలో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వ్యవసాయ బోర్లు వట్టిపోవడం వల్ల అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలోని జడ్చర్ల మండలం భూరెడ్డి పల్లికి చెందిన ప్రతాప్​ రెడ్డి అనే రైతు తాను సాగుచేస్తున్న గులాబీ పంటను నీటికష్టాలనుంచి గట్టెక్కించేందుకు వినూత్న మార్గం కనుగొన్నాడు.

సెలైన్​ పైపులతో నీరందిస్తూ

ప్లాస్టిక్​ వాటర్​ బాటిళ్లను సేకరించి వాటికి హాస్పిటల్​లో రోగులకు ఎక్కించే సెలైన్​ బాటిల్​ పైపులను తగిలించి ప్రతి మొక్కకో బాటిల్​ చొప్పున ఏర్పాటు చేశాడు. నిత్యం ఆ బాటిళ్లలో నీరు పోసి మొక్కలకు అందిస్తున్నాడు. దీనిద్వారా చుక్క నీరు కూడా వృథాగా పోకుండా సద్వినియోగం అవుతోంది. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నాడు ఈ అన్నదాత.

ఆలోచన అదిరింది... మొక్కల నీటి కష్టం తీరింది

ఇదీ చదవండి: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రసిద్ధ పురస్కారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details