అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య సముదాయాల ముందు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. నివారణ, నియంత్రణపై అవగాహన పెంచుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలను సమాయత్తం చేసేందుకు వారం రోజుల పాటు జిల్లాలోని వాణిజ్య సముదాయాల ముందు, పాఠశాలలు, కళాశాలలతో పాటు కాలనీవాసులకు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తామని ఆశాఖ అధికారులు స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదాలపై జిల్లా ప్రజలకు అవగాహన - safety
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అవగాహన కల్పించారు.
అగ్నిప్రమాదాలపై అవగాహన