మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రతే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఎండ వేడికి పత్తి అంటుకుంది..!
By
Published : Mar 25, 2019, 10:40 PM IST
ఎండ వేడికి పత్తి అంటుకుంది..!
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలో కోట్ల రూపాయల పత్తి నిల్వలు ఉన్నాయని... సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రమాదానికి ఎండల తీవ్రతే కారణమని అధికారులు భావిస్తున్నారు.