మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఇటీవల హత్యకు గురైన బాలిక హత్య కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. మైనర్ బాలిక హత్య ఘటన చాలా దారుణమని.. నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథిగృహంలో కేసు పూర్వాపరాలపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే స్పందించడం కాకుండా సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆచారి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని తెలిపారు.
బాలిక హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు - minor girl
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఇటీవల హత్యకు గురైన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్