తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్ భయం..కుటుంబంతో సహా పొలానికి మకాం - పొలానికి కుటుంబం

కరోనా మన జీవితాల్లో ఎన్నో మార్పులు తెస్తోంది. జీవన పాఠాలను సైతం నేర్పుతోంది. మన జీవన శైలిలో ఎన్నో మార్పులు తెస్తోంది. ఒకప్పుడు ఇరుగు పొరుగు వారు ఉంటేనే సందడి అనుకునేవారు. ఇప్పుడు మాత్రం ఒంటరిగా జీవించడమే మేలంటున్నారు. అందుకే గ్రామాన్ని వదిలి పొలంబాట పడుతున్నారు. పల్లెల్లో ఇటీవల కేసులు పెరగడంతో కుటుంబంతో సహా పొలానికి మకాం మార్చాడు మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన రాములు అనే రైతు.

family shifted to field
పొలానికి మకాం మార్చిన కొనగట్టుపల్లి చెందిన రాములు

By

Published : Apr 29, 2021, 9:15 AM IST

కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిలో గ్రామాల్లో పెద్దసంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పల్లెవాసులు వైరస్‌ బారి నుంచి తప్పించుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందుక భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన రాములు కొన్ని రోజులుగా భార్య, పిల్లలతో కలిసి పొలం వద్ద గుడిసెలోకి మకాం మార్చారు.

కుటుంబానికి అవసరాలకు సరిపోయేంత సామగ్రి తీసుకువెళ్లి అక్కడే నివాసముంటున్నారు. ఏదైనా అత్యవసరమైతే ఊరి నుంచి అప్పటికప్పుడు తెచ్చుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గాక గ్రామానికి తిరిగివెళ్తామని రాములు చెబుతున్నారు.

ఇదీ చూడండి:పల్లెవిస్తున్న టీకాస్త్రం...వ్యాక్సినేషన్‌లో గ్రామీణుల స్ఫూర్తి

ABOUT THE AUTHOR

...view details