జిల్లావ్యాప్తంగా విస్తృతంగా సోలార్, ఎల్ఈడీ బల్బులను వినియోగించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు తక్కువని...ఎల్ఈడీ బల్బులు వినియోగించడం వల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయని మంత్రి సూచించారు.
ఇంధన పొదుపుపై విస్తృత ప్రచారం కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్ - ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి
ఇంధన వనరుల ఆదా కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పురపాలికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇంధన పొదుపు వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ పురపాలికలో 21వేల723 సోలార్, ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. అన్నీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలల్లోనూ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రైవేటు రంగంలోనూ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ ఉపయోగించాలన్నారు. మార్కెట్ యార్డులు, గోదాములలో ఎల్ఈడీలను ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్ రాజుకు సూచించారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించి...జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి కోరారు.