ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లాకే తలమానికంగా ఉండే విధంగా మరో పెద్ద కంపెనీని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దివిటిపల్లి దగ్గర నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లతో పాటు ఐటీ టవర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంక్రటావుతో కలిసి పరిశీలించారు. ఐటీ పార్కు పనులు పూర్తయితే జిల్లాలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు మరో పెద్ద కంపెనీ: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - ఐటీ టవర్
మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా ఉండే విధంగా మరో పెద్ద కంపెనీని తీసుకురాబోతున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి దగ్గర నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లతో పాటు ఐటీ టవర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంక్రటావుతో కలిసి పరిశీలించారు.
![మహబూబ్‌నగర్ జిల్లాకు మరో పెద్ద కంపెనీ: మంత్రి శ్రీనివాస్ గౌడ్ excise-minister-srinivas-goud](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9333289-837-9333289-1603809600244.jpg)
నాలుగు వందల ఎకరాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని.. ఇక్కడ పనులు పూర్తయితే ప్రథమంగా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగలిగామని.. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించడమే తమ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న పలు పెద్ద కంపెనీలు మహబూబ్ననగర్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'హలో! మంత్రి ఈటల కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ..'