తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్నగర్ జిల్లాలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం కోనేరు సమీపంలో అక్రమ తవ్వకాలను పోలీసులు అడ్డుకున్నారు. చిన్న చింతకుంట మండలంలోని ఈ ఆలయం వద్ద ఉన్న పురాతన కోనేరు సమీపంలో గుప్తనిధుల కోసం కొందరు ప్రయత్నించారు. రాత్రికి రాత్రే తవ్వకాలను వేగవంతం చేసేందుకు జేసీబీ యంత్రంతో కారులో వచ్చారు.
కురుమూర్తి ఆలయ సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు - illegal excavations at kurumurthy temple
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ సమీపంలో కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. గుప్త నిధుల కోసం చేపట్టిన ఆ తవ్వకాలను పోలీసులు అడ్డుకున్నారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు
రాత్రి సమయంలో తవ్వకాలు ప్రయత్నించే సమయంలోనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారును, జేసీబీ యంత్రాన్ని వదిలిపెట్టి పరారైనట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించిన ఘటనపై భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రత కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:కరోనాను సమర్థంగా ఎదుర్కొంటాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్