తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..' - errabelli dayakara rao tour

గ్రామాల్లో శ్రమదానం చేసిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ గ్రామసభకు హాజరయ్యారు.

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..'

By

Published : Oct 3, 2019, 9:04 PM IST

ప్రతి గ్రామానికి ఏడాదికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మహబూబ్​నగర్ హన్వాడ గ్రామసభకు మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి హాజరయ్యారు. శ్రమదానం చేసిన మహిళ సంఘాలకు 50వేల నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల స్వరూపాలు మారుతున్నాయన్నారు.

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..'

ABOUT THE AUTHOR

...view details