తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఆర్సీపై మండిపడ్డ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు - మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాల ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసినా పీఆర్సీ వద్దంటూ మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని చౌరస్తాలో నిరసన చేపట్టారు.

employees and teachers unions angry on state govt PRC today in mahaboobnagar district
పీఆర్సీకీ వ్యతిరేకంగా మహబూబ్​నగర్​లో ఉద్యోగ సంఘాల ధర్నా

By

Published : Jan 27, 2021, 9:21 PM IST

ఉద్యోగలు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను తీవ్రంగా నిరాశపరిచినా పీఆర్సీ వద్దంటూ మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని చౌరస్తా వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఆర్సీ ప్రకటన ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం పోరాటంలో ముందుండి నడిపించిన ఉద్యోగులను ఈ నివేదిక నిరాశకు గురి చేసిందన్నారు. ధనిక రాష్ట్రం కావడం వల్ల 63 శాతం ఫిట్​మెంట్ ప్రకటిస్తారని ఆశించామన్నారు. దాదాపు 30 నెలల ఆలస్యంతో ఇచ్చిన మొట్టమొదటి పీఆర్సీని తక్కువగా ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వైపు ఇళ్ల అద్దె ధరలు పెరుగుతుంటే నివేదికలో తగ్గించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు మినహా అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవిధంగా ఫిట్​మెంట్​, పీఆర్సీని ప్రకటించాలని.. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

ఇదీ చూడండి :నెలాఖరులోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి: సీఎస్‌

ABOUT THE AUTHOR

...view details