మహబూబ్నగర్లో ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, జెన్ మనీ ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం అనే అంశంపై నిపుణులు అవగాహన కల్పించారు. మంచి రాబడి కోసం వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ రీజనల్ హెడ్ వెంకట్ వినోద్ సూచించారు. తక్కువ వయసు నుంచే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక లక్ష్యాలనైనా సాధించవచ్చన్నారు. అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, వాస్తవాలు తెలుసుకోకుండా పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని జెన్ మనీ ఫండ్ మేనేజర్ రామకృష్ణ అన్నారు.
'తక్కువ వయసు నుంచే పెట్టుబడులు పెట్టాలి' - ఈనాడు
పిల్లల చదువులు, ఆరోగ్యం, పదవీ విరమణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితేనే లక్ష్యాలు నెరవేరుతాయని ఆర్థిక నిపుణులు సూచించారు.
'తక్కువ వయసు నుంచే పెట్టుబడులు పెట్టాలి'