గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈనాడు నిర్వహిస్తున్న పోటీలు ఎంతో స్ఫూర్తిదాయకమని మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేక అధికారి వల్లూరి క్రాంతి అభిప్రాయపడ్డారు. పోటీల్లో గెలుపు ఓటములు సహజమని.... గెలుపొస్తే పొంగిపోయి.. ఓటమి పాలైతే కుంగిపోవద్దని హితవు పలికారు.
'ఈనాడు ఛాంపియన్' క్రీడా పోటీలు ప్రారంభం - 'ఈనాడు ఛాంపియన్' క్రీడా పోటీలు ప్రారంభం
ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 జిల్లాస్థాయి క్రీడాపోటీలను మహబూబ్నగర్లో జిల్లా ప్రత్యేక అధికారి వల్లూరి క్రాంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

'ఈనాడు ఛాంపియన్' క్రీడా పోటీలు ప్రారంభం
ఈ జిల్లా స్థాయిల్లో 24 సీనియర్ జట్లు, 36 జూనియర్ జట్లు పోటీ పడుతుండగా.. ఈ నెల 26 వరకూ పోటీలు కొనసాగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
'ఈనాడు ఛాంపియన్' క్రీడా పోటీలు ప్రారంభం
TAGGED:
EENADU CRICKET Games-2019