ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కరోనా నిబంధనలతో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడ్రోజుల పాటు రెండు పూటలా జరిగే ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1494 మంది విద్యార్థులు హాజరవనున్నారు.
కరోనా నిబంధనల మధ్య ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష - EAMCET engineering exam in mahabubnagar district
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. మూడ్రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలకు 1494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో రెండో రోజుమొదటి సెషన్ ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
కరోనా నిబంధనల మధ్య ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష
గురువారం ఉదయం 9 గంటలకు మొదటి సెషన్ ప్రారంభం కాగా.. ఏడు గంటల నుంచే విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, చేతులు శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించిన తర్వాతే లోనికి పంపించారు.
TAGGED:
Eamcet_Exam start