మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పెద్ద చెరువులో పక్షుల సందడి నెలకొంది. చలి తీవ్రత తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుండడంతో వివిధ ప్రాంతాల నుంచి పక్షులు వస్తున్నాయి. అడవి బాతులు నీటిలో తేలియాడుతూ, కొంగలు గాలిలో విహరిస్తూ అటుగా వెళ్లేవారికి కనువిందు చేస్తున్నాయి. ఆ దృశ్యాలను 'ఈటీవీ భారత్' కెమెరా క్లిక్ మనిపించింది.
ప్రకృతి వరం.. పెద్దచెరువులో పక్షుల సోయగం! - ducks swimming in pedda cheruvu
రాష్ట్రంలో చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇన్నిరోజులు మంచుతో కప్పి ఉన్న వాతావరణం మెల్లమెల్లగా సాధారణ స్థాయికి చేరింది. దీంతో ప్రకృతి ప్రేమికులను అలరించడానికి వివిధ ప్రాంతాల నుంచి పక్షులు తరలివచ్చాయి. దేవరకద్ర పెద్ద చెరువులో బాతులు సందడి చేస్తున్నాయి. కొంగలు ఆకాశంలో ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
![ప్రకృతి వరం.. పెద్దచెరువులో పక్షుల సోయగం! pedda cheruvu devarakadra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10348305-255-10348305-1611385657979.jpg)
పెద్దచెరువులో పక్షుల సందడి