పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోయిల్ సాగర్ జలాశయం నుంచి తాగునీటి సరఫరా చేపట్టింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ధర్మాపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆ పైపులైను స్లూయిస్ వాల్వ్ దగ్గర లీకేజి అవుతోంది. 5 అంగుళాల పైపు... 24 గంటల పాటు నీరు పోస్తూనే ఉంటుంది. ఇలా చాలా రోజులుగా జరుగుతుండటంతో కొందరు తమ పొలాలకు మళ్లించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. 15 ఎకరాల పంటను సాగుచేసేంత నీరు వృథా అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరుగా మారిన తాగునీరు
తాగునీటి కోసం వేల గొంతుకలు వేచి చూస్తుంటే... అధికారుల నిర్లక్ష్యంతో తాగునీరును సాగునీరుగా మార్చారు కొందరు. వృథాగా పోతున్నాయన్న సాకుతో తాగునీటితో తమ పొలాలను పండించుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరుగా మారిన తాగునీరు
ఏడాది కాలంగా నీరు వృథాగా పోతున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఇది నిజంగానే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా? లేక ఈ గ్రామస్థులే కావాలని నీటిపైపును లీక్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి వెంట ఉన్న పైపులైను లీకేజీలను కట్టడి చేసిన అధికారులు దీనిని ఇలా ఎందుకు వదిలేశారనే విషయం అంతుచిక్కడం లేదు.
ఇవీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు