తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్‌ ఇళ్ల పేరిట బురిడీ.. రూ.5 లక్షలిస్తే పట్టా రెడీ అంటూ.. - Mahbubnagar latest news

Double bedroom house fraud in Mahbubnagar: మహబూబ్ నగర్‌లో రెండుపడక గదుల ఇళ్ల కేటాయింపుల వ్యవహారం.. కొత్త వివాదానికి దారితీసింది. 5 లక్షలిస్తే పట్టా చేతికిస్తామంటూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ దుమారం రేపింది. ఆ ఘటనపై విచారణ చేపట్టిన.. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. తాజా పరిణామాలతో నిరుపేద కుటుంబాలు.. ఇళ్లు వస్తాయా లేదా అన్న అందోళనలో పడ్డారు.

Mahbubnagar
Mahbubnagar

By

Published : Sep 28, 2022, 9:29 AM IST

డబుల్‌ ఇళ్ల పేరిట బురిడీ.. రూ.5 లక్షలిస్తే పట్టా రెడీ అంటూ..

Double bedroom house fraud in Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల వ్యవహారంపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఐదు లక్షలిస్తే రెండుపడక గదుల ఇళ్లు సొంతమని అందుకు అవసరమైన పట్టా అందిస్తామంటూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యదర్శి కుమారుడు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆ సంభాషణలు మహబూబ్ నగర్‌లో దుమారం సృష్టించాయి.

36నకిలి ఇళ్ల పట్టాలు స్వాధీనం: ఐతే అక్రమ బాగోతం వెనక పెద్దముఠా ఉన్నట్లుగా ప్రచారం సాగడంతో. విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురు ముఠాసభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 13లక్షల 60 వేలు, 40 నకిలీ పట్టాలు, ప్రింటర్‌లు స్వాధీనం చేసుకున్నారు. దివిటిపల్లి సమీపంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో.. పలువురు నకిలీ పట్టాలతో లబ్ధి పొందినట్టు సమాచారంతో రెవెన్యూ, పోలీసు యంత్రాగం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తహశీల్దారు కార్యాలయం నుంచి జారీ చేసిన పట్టాలను అక్కడ ఇళ్లలో నివసిస్తున్న వారి పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. 36 పత్రాలు నకిలీవి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

67లక్షల 37 వేలు వసూళ్లు చేసిన నిందితులు:అందుకు సంబంధించి ప్రధాన నిందితుడైన హసన్‌తో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఐదుగురు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 36 మంది బాధితుల నుంచి 67లక్షల 37 వేలు వసూలు చేశారని చెప్పారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్న అర్హులైన లబ్ధిదారులు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. దివిటిపల్లిలో 1024, వీరన్నపేటలో 660 ఇళ్లు ప్రారంభించినా.. వాటిని ఎవరికి ఇచ్చారు. ఎంత మందికి కేటాయించారన్న విషయాలు తేలట్లేదు. సర్వే నెంబర్ 523లో గతంలో ఇంటిస్థలం పొందిన వాళ్లు.. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రెవెన్యూ అధికారులకు తిరిగి ఇచ్చారు.

ఇంటిస్థలం పట్టా తిరిగిచ్చిన అసలైన లబ్దిదారులను వదిలి.. దొంగపట్టాలు సమర్పించిన వారికి ఇళ్లు కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏళ్లుగా అద్దె ఇళ్లలో నెట్టుకొస్తున్న లబ్ధిదారులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండుపడక గదులఇళ్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అందులో ఎంతటివారున్న ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details