నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. విద్యాలయానికి చెందిన యస్ఓ జ్ఞానేశ్వరి, అటెండర్ మాధవి క్షుద్రపూజలు చేసిన సంఘటనలో గత నెల 1న కలెక్టర్ రోనాల్డ్ రోస్ సస్పెండ్ చేశారు. తిరిగి అటెండర్ను విధుల్లోకి తీసుకోవడంపై వారు ఆందోళన చేపట్టారు. తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
క్షుద్రపూజల అటెండర్ వద్దు
క్షుద్రపూజలు నిర్వహించిన అటెండర్ను విధుల్లో నుంచి తొలగించాలంటూ నారాయణపేట జిల్లా మాగనూర్ కస్తూర్బా గాంధీ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన