గతంలో కంటే తెరాసకు తగ్గిన మెజార్టీ, ఓడిపోయిన సీట్లను చూస్తుంటే... ఏ క్షణమైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కనిపిస్తుందని భాజపా నేత డీకే అరుణ జోస్యం చెప్పారు. అసెంబ్లీ స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించే కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు పోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు లోక్‌సభ స్థానం తెరాస కైవసం చేసుకున్నా... నైతిక విజయం భాజపాదేనని వెల్లడించారు. జిల్లాలో తెరాస నేతలు గుండాగిరి చేసి భాజపా నాయకులను అడ్డుకోవాలని చూసినా, వారిని భయభ్రాంతులకు గురిచేసినా ఖబడ్దార్ అని అరుణ హెచ్చరించారు.
రాష్ట్రంలో తెరాస జోరు తగ్గిపోతుంది: డీకే అరుణ - DK.Aruna fire on-kcr
నిజామాబాద్‌లో కవిత ఓటమిపాలవడానికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని భాజపానేత డీకే అరుణ డిమాండ్ చేశారు. నాలుగు నెలల్లోనే తెరాస పట్ల ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారన్నారు. దీనికి కారణం తాజా పార్లమెంట్ ఎన్నికలే నిదర్శనమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తెరాస జోరు తగ్గిపోతుంది: డీకే అరుణ
TAGGED:
DK.Aruna fire on-kcr