తెలంగాణ

telangana

ETV Bharat / state

WATER DISPUTES: 'పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదు' - dk aruna press meet in mahabubnagar

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్​ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మహబూబ్​నగర్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అరుణ విమర్శలు గుప్పించారు.

dk aruna comments on cm kcr
సీఎం కేసీఆర్​పై డీకే అరుణ కామెంట్స్​

By

Published : Jun 26, 2021, 5:37 PM IST

Updated : Jun 26, 2021, 7:44 PM IST

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదు: డీకే అరుణ

తెలంగాణ సాధన ఉద్యమంలో పాలమూరు జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టులపై ముఖ్యమంతి కేసీఆర్​ ఎందుకంత ఉదాసీనతగా ఉన్నారో తెలపాలని డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 15.9 టీఎంసీ నీళ్లు వాడుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంటే.. కేవలం 4 నుంచి 5 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుంటున్నామని అరుణ పేర్కొన్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 4 టీఎంసీల కేటాయింపులకే ప్రత్యేకంగా పథకాలు చేపట్టి నీళ్లు తీసుకుపోతుందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్‌ స్పందించడం లేదని.. ఆ ప్రభుత్వంతో ఏ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు.

'పాలమూరు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ది లేదు. ఏపీ సీఎం జగన్‌ మద్దతు కోసం అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నించడం లేదు. భారత్‌ మాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు.' -డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు.

రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే భారత్‌మాల రిపోర్టు తప్పుల తడకగా ఉందని.. ఈ ప్రాజెక్టుపై మరోసారి పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు డీకే అరుణ చెప్పారు. అధికారుల బృందం పర్యటించి వివరాలు సేకరించనున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్ల పై బడిన వారందరికీ కరోనా టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అరుణ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు

Last Updated : Jun 26, 2021, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details