తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి' - పోలీసుల అత్యుత్సాహం మానుకోవాలి

పురపాలిక ఎన్నికలలో గెలిచేందుకు తెరాస ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కుట్రలు పన్నుతోందే తప్ప చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు.

'పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి'

By

Published : Nov 2, 2019, 7:47 PM IST

పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో మోసానికి తెర తీసిందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. ఇప్పటికిప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు శంఖుస్థాపనలు చేయడం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పట్టణాలను సుందరీకరణ చేస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైందని.. వారు కూడా తెలంగాణలో ఉద్యోగులేనన్న విషయం మర్చిపోవద్దని అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌ ఎంపీపై జరిగిన పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చేప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా యాభై వేల కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు.

'పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి'

ఇవీచూడండి: ఆర్టీసీ సమ్మెను దిల్లీకి తీసుకెళ్తాం: అశ్వత్థామరెడ్డి

ABOUT THE AUTHOR

...view details