రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక నిధులను ఇస్తున్నట్లు మహబూబ్ నగర్ భాజపా పార్లమెంటరీ అభ్యర్థి డీకే అరుణ తెలిపారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాను మరిచిపోయారని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ప్రారంభించి మూడేళ్ళలో పూర్తి చేస్తామన్నా, నేటికీ పనులు పూర్తి కాలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదావరి జలాలను పాలమూరుకు తరలించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నిర్వహించిన రోడ్డు షోలో పాలమూరు ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
'ఉద్యమ పార్టీని కుటుంబ పార్టీగా మార్చారు' - MOP
గత పార్లమెంటులో 13 మంది ఎంపీలున్నా కేసీఆర్ సాధించిందేమీ లేదని పాలమూరు భాజపా ఎంపీ అభ్యర్థి డీకే. అరుణ విమర్శించారు. ఉద్యమ పార్టీ అయిన తెరాసను రాజకీయ, కటుంబ పార్టీగా మార్చారని కేసీఆర్పై ధ్వజమెత్తారు ఎంపీ జితేందర్ రెడ్డి.

'ఉద్యమ పార్టీని కుటుంబ పార్టీగా మార్చారు'
Last Updated : Apr 2, 2019, 7:30 PM IST