మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతునాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు, చెక్ డ్యాములు నిండుకుండలా మారాయి. జలకల సంతరించుకోవడం వల్ల రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులతో కలిసి నూతనంగా నిర్మించిన చెక్ డ్యాము వద్ద పూజలు చేసి..గేట్లను ఎత్తి నీటిని వదిలారు. వర్షపునీరుతోపాటు నియోజక వర్గ పరిధిలో వివిధ ప్రాజెక్టుల ద్వారా నీరు అందుబాటులో ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు.
విస్తార వర్షాలకు జిల్లా రైతుల ఆనందాలు - Devarakadra
కరువు కాటకాలతో తల్లడిల్లే మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలాశాయాలన్ని నిండుకుండాలా మారడం వల్ల.. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![విస్తార వర్షాలకు జిల్లా రైతుల ఆనందాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4496771-266-4496771-1568956489228.jpg)
విస్తార వర్షాలకు జిల్లా రైతుల ఆనందాలు