దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్కౌంటర్ సరైందని భావించలేమని ఆమె కాలనీవాసుల్లో పలువురు అభిప్రాయపడ్డారు. కానీ తమ ఆడబిడ్డకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
దిశ ఘటనలో ఐదు జీవితాలు నాశనం - ప్రియాంకరెడ్డి హత్య
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్కౌంటర్ సరైందని భావించక పోయినా... తమకు న్యాయం జరిగిందని మాత్రం చెప్పగలమని ఆమె కాలనీవాసులు తెలిపారు.
దిశ ఘటనలో ఐదు జీవితాలు నాశనం
దిశ హత్యాచార కేసులో ఐదుగురి జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని తెలిపారు.
తమ ఆడబిడ్డకు సత్వర న్యాయం చేసిన తెలంగాణ పోలీసులకు, ముఖ్యమంత్రి కేసీఆర్కు దిశ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తే.. మరోసారి ఆ తప్పు జరిగే అవకాశం ఉండదని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి : దిశ ఎన్కౌంటర్తో వెల్లివిరిసిన ఆనందం