'దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష' - disha case
08:11 December 21
దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష : హైకోర్టు
దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23 సా.5 గంటల లోపు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలిపింది. మృతదేహాలకు దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. శవపరీక్షను చిత్రీకరించి తమకు అప్పగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శవపరీక్ష అనంతరం మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించాలని గాంధీ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని... సీఎస్‌ఎస్‌ఎల్‌కు పంపాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, వాహనాలు, ఆయుధాల రిజిస్టర్ వివరాలు తీసుకోవాలని సిట్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఆధారాలు స్వాధీనం చేసుకుని కమిషన్‌కు అప్పంగించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ