తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!... ఆమె 6 నెలల గర్భవతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు భార్య మైనర్​ అని తేలింది. నారాయణపేట జిల్లా సంరక్షణ విభాగం వారి గ్రామంలో ప్రాథమిక విచారణ చేపట్టింది.

disha case accused Chenna Keshavalu's wife Minor
దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి

By

Published : Dec 21, 2019, 10:47 AM IST

Updated : Dec 21, 2019, 12:39 PM IST

దిశ హత్యాచార నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనరని తేలింది. శుక్రవారం నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం వారి గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. బాలిక వయసు 13సంవత్సరాల ఆరు నెలలుగా (జన్మదినం: 15-06-2006)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి కూడా. చెన్నకేశవులు తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని వారి దృష్టికి తీసుకెళ్లగా... వారు అంగీకరించలేదు.

బాలికకు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఉండేది. చెన్నకేశవులును ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రసుత్తం వారిద్దరు బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు. ఈ అంశంపై ప్రాథమిక నివేదికను తయారు చేశామని, దానిని ఉన్నతాధికారులకు పంపిస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారి రాములు తెలిపారు.

దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!

ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ

Last Updated : Dec 21, 2019, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details