దిశ నిందితుల మృతదేహాలు తరలింపు - disha accused deadbodies transfered
![దిశ నిందితుల మృతదేహాలు తరలింపు disha-accused-deadbodies-transfered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5304313-1075-5304313-1575747195694.jpg)
00:34 December 08
వైద్య కళాశాల భవనానికి మృతదేహాలు తరలింపు
దిశ హత్య కేసుల నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రి మార్చూరి నుంచి పట్టణ శివారులో తిరుమల హిల్స్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను అక్కడే భద్రపరుచగా.. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలించింది.
ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం.. ఘటనకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో మృతదేహాలను పోలీసులు మహబూబ్‌నగర్ పట్టణ శివారులోని మయూరి పార్కు వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఇవీ చూడండి: ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం