తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ హత్య కేసు నిందితుల్లో ఇద్దరు మైనర్లు?

దిశ హత్య కేసు నిందితుల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పాఠశాల బోనఫైడ్ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల కుటుంబసభ్యులు..మైనర్లని కూడా చూడకుండా తమ బిడ్డలను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేశారని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.

direction-murder-case-two-minors-accused
direction-murder-case-two-minors-accused

By

Published : Dec 10, 2019, 5:21 AM IST

Updated : Dec 10, 2019, 12:14 PM IST

దిశ హత్యాచారం కేసు నిందితుల్లో ఇద్దరు మైనర్లా? పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్లలోని వారి వయసు ఆధారంగా ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నలుగురు నిందితులల్లో మహ్మద్‌ ఆరిఫ్‌కు 26 ఏళ్లు, జొల్లు శివకు 20, జొల్లు నవీన్‌కు 20, చెన్నకేశవులుకు 20 ఏళ్లు ఉన్నట్లు పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు.

అయితే మానవహక్కుల సంఘం విచారణ బృందం ముందు ఆదివారం విచారణకు హాజరైన నిందితుల కుటుంబసభ్యులు.. ‘మైనర్లని కూడా చూడకుండా మా బిడ్డలను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేశార’ని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మాట విన్న వెంటనే ‘మీ కుమారులకు సంబంధించిన వయసు ధ్రువీకరణ పత్రాలు ఉంటే సమర్పించండి’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం వారికి సూచించింది.

ఆదివారం సాయంత్రం పోలీసులు నిందితుల ఇళ్లకు వెళ్లి ఆధార్‌కార్డుల నకళ్లు తీసుకున్నారు. మళ్లీ సోమవారం వెళ్లి, ఇద్దరు నిందితులకు సంబంధించిన పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్లను సేకరించారు.

  • అందులో ఒకరి పుట్టిన తేదీ 15-08-2002గా ఉంది. దీని ప్రకారం అతడి వయసు ప్రస్తుతం 17 సంవత్సరాల ఆరు నెలలు. ఆధార్‌కార్డులో మాత్రం పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది.
  • మరో నిందితుడి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌లో 10-04-2004గా ఉంది. దీని ప్రకారం అతడి వయసు 15 సంవత్సరాల ఎనిమిది నెలలు. ఇలా తేదీలు వేర్వేరుగా ఉండడంతో ఏది వాస్తవమనే సందేహాలు నెలకొన్నాయి.

నలుగురు నిందితుల్లో మహ్మద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని పోలీసులు చెప్పినా, వీరికి డ్రైవింగు లైసెన్సులు కూడా లేవని సమాచారం

Last Updated : Dec 10, 2019, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details