మహబూబ్నగర్ డైట్ కళాశాల మైదానంలో మార్కెట్ నిర్మించవద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల మైదానంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయాల్సి ఉండగా... విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాలకు కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వాడటంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
'కళాశాల మైదానంలో మార్కెట్ ఎందుకు నిర్మిస్తారు?' - STUDENTS PROTEST IN MAHABOOBNAGAR
మహబూబ్నగర్ డైట్ కళాశాల మైదానంలో మార్కెట్ నిర్మించటాన్ని వ్యతిరేకిస్తూ... విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల మైదానాన్ని వేరే అవసరాలకు ఎలా ఉపయోగిస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
!['కళాశాల మైదానంలో మార్కెట్ ఎందుకు నిర్మిస్తారు?' DIET STUDENTS PROTEST AGAINST MARKET IN COLLEGE GROUND](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6184824-thumbnail-3x2-ppp.jpg)
DIET STUDENTS PROTEST AGAINST MARKET IN COLLEGE GROUND
నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను బయటకు పంపించేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కళాశాలలోకి ప్రవేశించి విద్యార్థులందరిని బలవంతంగా బయటికి పంపించారు. మరికొందరిని బయటికి రాకుండా తలుపులు మూసేశారు. తోపులాటలో విద్యార్థుల విలువైన ఫోన్లు ధ్వంసమయ్యాయి. కళాశాల మైదానంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'కళాశాల మైదానంలో మార్కెట్ ఎందుకు నిర్మిస్తారు?'