తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీసేవా కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్​లో స్లాట్​ బుకింగ్​' - మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్ వెంకట్రావు

మీ సేవా కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్​లో స్లాట్​ బుకింగ్​ చేసుకునే విధంగా భూ యజమానులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ వెంకట్రావు తెలిపారు. నేటి నుంచి పోర్టల్​ ద్వారా సేవలందించేందుకు తహసీల్దారు కార్యాలయాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

dharani portal starts today onwards slot booking from mee seva
ధరణి పోర్టల్​ స్లాట్ బుకింగ్స్​

By

Published : Nov 2, 2020, 8:41 AM IST

మీ సేవా కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్​లో స్లాట్ బుకింగ్​ చేసుకునే విధంగా భూ యజమానులకు అవకాశం కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ సేవలను కలెక్టర్​ తనిఖీ చేశారు. పోర్టల్ ద్వారా నవంబర్‌ 2 నుంచి సేవలందించేందుకు అన్ని కార్యాలయాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్​కు ప్రతి లావాదేవీకి రూ. 200 చొప్పున చెల్లించాలని కలెక్టర్​ తెలిపారు. స్లాట్ బుకింగ్​తో పాటు పది పేజీల వరకు ఉచితంగా ప్రింట్ అవుట్స్ పొందవచ్చని, అదనంగా కావాల్సి వస్తే ప్రతి పేజీకి రూ. 5 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:నేటి నుంచి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు

ABOUT THE AUTHOR

...view details