మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో స్వయంభువు రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశీగా పేరొందిన కందూరులో మహా శివరాత్రి రోజు స్వామివారిని దర్శించి, అభిషేకాలు నిర్వహిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు.
కందూరు ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు - కందూరు ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు
ప్రముఖ ప్రాచీన శైవ క్షేత్రం కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
కందూరు ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు
స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసేందుకు భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కాశీలో ఉన్న కదంబ వృక్షాలు.. కేవలం కందూరులో మాత్రమే కనిపించడం ఈ ఆలయ ప్రత్యేకత.
ఇవీ చూడండి:పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!