మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో శ్రీ ఈశ్వర వీరయ్య స్వామి ఆలయంలో శివారాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు.
పంచామృతాలతో స్వామి వారికి అభిషేకాలు - devotees rush at devarakadra temple on maha shivaratri
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు శివాలయాలలో అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు.
పంచామృతాలతో స్వామి వారికి అభిషేకాలు
స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఇవీ చూడండి:పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!