ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్లో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ తోటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. రైతులు మార్కెట్ డిమాండ్‌ను బట్టి పంటలను సాగు చేయాలని సూచించారు.
'ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి' - Devarkadra MLA Ala venkateswar reddy latest news
ఆరో విడత హరితహారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అన్నసాగర్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. రాబోయే రోజుల్లో ఈ పంటల సాగుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.
!['ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి' Devarkadra MLA Ala venkateswar reddy planted Oil Farm plants in Bhuthupur mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7790931-754-7790931-1593244114176.jpg)
ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి
సీఎం కేసీఆర్ రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ సారి వానాకాలంలో నియంత్రిత పంటలు వేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. వరి పంటను తగ్గించి వాణిజ్య పంటలపై ఆసక్తి చూపించాలని, ఆయిల్ ఫామ్ మొక్కలు పెంచడానికి రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ మహబూబ్ నగర్ జిల్లా అధికారి సాయిబాబా, దేవరకద్ర నియోజకవర్గ క్లస్టర్ అధికారి మహేందర్, ఆయిల్ ఫెడ్ ఏరియా అధికారి బాలరాజు పాల్గొన్నారు.
TAGGED:
ఆయిల్ ఫామ్ సాగు