శతాధిక కట్టడం నూట ఒకటో వసంతంలోకి అడుగెట్టింది. వందేళ్లుగా సేవలందిస్తూ.. నేటికీ పదిలంగానే ఉంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని పురాతన పోస్టాఫీసు కార్యాలయం ఇన్నేళ్లైనా చెక్కుచెదరకుండా ఉంది. నిజాం పాలన సమయంలో 1921లో ఈ భవనం నిర్మించారు. గ్రామీణ ప్రాంతాలకు సేవలందించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ కార్యాలయం వందేళ్లుగా సేవలందిస్తూనే ఉంది.
నాటి నిర్మాణం నేటికీ పదిలమే
కొన్ని పురాతన కట్టడాలు నేటీకి చెక్కుచెదరకుండా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఏళ్లు తరబడి సేవలందిస్తున్నా ఎప్పటికీ అప్పటిలాగనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని తపాలా కార్యాలయం. నిజాం కాలంలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ పదిలంగానే ఉంది.
నాటి నిర్మాణం నేటికీ పదిలమే
మండు వేసవిలోను ఈ విశాల భవనంలో చల్లగా ఉంటుంది. భవనంలో నాడు ఏర్పాటుచేసిన ఫ్యాన్ ఇప్పటికీ పని చేయడం విశేషం. శాఖాపరంగా వినియోగించే స్టాంపులు ముద్రలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న కార్యాలయంలో విధులు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని కార్యాలయ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనానికి ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు తపాలశాఖ ఈ మధ్యనే ఉపక్రమించింది.
ఇదీ చూడండి:పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి సబిత