తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పాలమూరు జిల్లాలోని శ్రీ కురుమూర్తి స్వామి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆది నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు భంగం కలగనివ్వకుండా... కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో భక్తులు తగిన చర్యలు తీసుకుని స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సు సౌకర్యాలు, వ్యాపార సముదాయాల ఏర్పాటుకు ఈసారి ఆస్కారం లేదన్నారు. భక్తులు ఒకే రోజు కాకుండా... రద్దీ తక్కువగా ఉన్న సమయంలో స్వామి వారిని దర్శనం చేసుకోవాలని కోరారు.
'సంప్రదాయాలకు భంగం కలగకుండా కురుమూర్తి జాతర నిర్వహిస్తాం'
సంప్రదాయాలకు భంగం కలగకుండా కురుమూర్తి జాతర మహోత్సవాలను నిర్వహిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.
'సంప్రదాయాలకు భంగం కలగకుండా కురుమూర్తి జాతర నిర్వహిస్తాం'
ఇంత చెబుతున్నా ప్రతిపక్ష పార్టీలు యధావిధిగా జాతరను నిర్వహించాలని పట్టుబట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కరోనా సమయంలో భక్తులను మహమ్మారి నుంచి రక్షించాల్సిన వారు ఇలా ఆందోళన చేయటం సరైంది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు