అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలసి ఊక చెట్టు వాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. పెద్ద వాగులో ప్రవహిస్తున్న నీటిని పరిశీలించి జల పూజ చేశారు.
'అన్నదాతకు అండగా నిలిచేందకు రాష్ట్ర ప్రభుత్వం కృషి'
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పర్యటించారు. కురుమూర్తి స్వామి ఆలయ సమీపంలో రూ. 8 కోట్ల 11 లక్షలతో, దేవరకద్ర మండలంలోని రేకులపల్లి సమీపంలో రూ.4.84 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
devakadra mla ala narayanareddy layed foundation stone
నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు.. కరివేన ప్రాజెక్టుతోపాటు కోయిల్ సాగర్ నుంచి రామన్‌పాడ్ వరకు, కందూరు నుంచి సరళాసాగర్ వరకు ఉన్న రెండు వాగులలో చెక్ డ్యాం నిర్మాణానికి పూనుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూ. 111 కోట్లతో 18 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతిచ్చిన సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.