పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు బోగీలు
ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలెట్ సమయస్ఫూర్తితో రైలు నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.