మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో పంచాయతీ తీర్పు ఇచ్చిన పెద్దలను కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పంచాయతీ పెట్టి గుండు గీయించాలని తీర్పు చెప్పిన పెద్దలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో ఆత్మహత్య యత్నానికి యత్నించిన యువకుడు రాఘవేందర్‌తో పాటు అతని తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
గుండు గీయించిన ఘటనపై భగ్గుమన్న బీసీ నేతలు - demanding-to-arrest-surpunch
మహబూబ్‌నగర్ జిల్లాలోని ముచ్చింతల గ్రామంలో ఇద్దరు యువకులకు గుండు గీయించిన ఘటనపై బీసీ సంఘం నేతలు భగ్గుమన్నారు. తీర్పు ఇచ్చిన పంచాయతీ పెద్దలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గుండు గీయించిన ఘటనపై భగ్గుమన్న బీసీ నేతలు