తెలంగాణ

telangana

ETV Bharat / state

జింకకు చెలగాటం... రైతుకు నష్టదాయకం! - Deer causing damage to the farmer news

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధి కృష్ణానది తీర గ్రామాల్లో జింకలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలాల్లో గుంపులుగా తిరుగుతుండటం వల్ల పంట దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జింకకు చెలగాటం... రైతుకు నష్టదాయకం!
జింకకు చెలగాటం... రైతుకు నష్టదాయకం!

By

Published : Dec 23, 2020, 7:17 AM IST

చెంగుచెంగున గెంతుతూ పరుగులు తీసే జింకలను చూస్తుంటే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధి కృష్ణానది తీర గ్రామాలైన కృష్ణా, మాగనూరు, మక్తల్‌, మరికల్‌, నర్వ, ఆత్మకూరు, అమరచింత, దేవరకద్ర, చిన్నంబావి తదితర మండలాల్లోని రైతులకు మాత్రం అవి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

తీర ప్రాంతాల్లో ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉండేవని, ఇప్పుడు వందల్లోకి చేరి పొలాల్లో గుంపులుగా తిరుగుతుండటంతో పంట దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంట వేసినప్పట్నుంచి కోతకోసే వరకు పొలాల వద్ద రేయింబవళ్లు కాపలా కాయాల్సి వస్తోందని వాపోయారు. అటవేతర ప్రాంతంలో తమ గ్రామాలు ఉండటంతో అటవీశాఖ పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

ఇదీ చూడండి:పర్యవేక్షణ లేకపోవడం వల్ల కల్తీ దందా సాగుతోంది: పద్మనాభరెడ్డి

ABOUT THE AUTHOR

...view details