మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. కొత్త ఉల్లి కోతకు రావడం వల్ల వివిధ ప్రాంతాల్లో సాగు చేసిన రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తీసుకువచ్చారు. దీనితో మార్కెట్ ఉల్లి రాశులతో కళకళలాడింది.
దిగివచ్చిన ఉల్లి... వినియోగదారుల హర్షం
ఇన్నాళ్లు ఉల్లి ధరలు మండిపోయాయి. ఇప్పుడు కొత్త ఉల్లి రాకతో... ధరలు దిగివస్తున్నాయి. కోతకొచ్చిన ఉల్లిని మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తీసుకురావడం వల్ల ఉల్లి రాశులతో కళకళలాడింది.
దిగివచ్చిన ఉల్లి... వినియోగదారుల హర్షం
సుమారు వెయ్యి బస్తాల ఉల్లికి మార్కెట్ వర్గాలు వేలంపాట నిర్వహించారు. ఉల్లి నాణ్యతను బట్టి... కనిష్టంగా క్వింటాకు 1,510 రూపాయల నుంచి 2250 రూపాయల వరకు కొనసాగింది. ఉల్లి ధరలు కాస్త దిగి రావడం వల్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి