మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అంతర్గత వంతెన పనులు జరుగుతున్న చోట సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల... హైవే నుంచి పక్కన సర్వీస్ రోడ్డులోకి వెళ్లే మలుపు వద్ద అదుపుతప్పి వాహనం బోల్తా పడింది.
జాతీయ రహదారిపై బోల్తా పడిన డీసీఎం - రోడ్డు ప్రమాదం వార్తలు
జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై డీసీఎం లారీ బోల్తా పడి... డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జాతీయ రహదారిపై బోల్తా పడిన డీసీఎం
హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈనెల 12న ఇదే ప్రదేశంలోనే జరిగిన లారీ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకువాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:బిల్లు కట్టమని వెయిటర్లకు మీ ఏటీఎం కార్డు ఇస్తున్నారా..?