తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల సమాచారంతో భారీ డేటా బేస్​కు​ ఏర్పాట్లు' - PALAMURU UNIVERSITY

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి కొత్త విప్లవానికి నాంది పలకబోతున్నామని  వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్​పై నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు.

వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ "కీ" ని తయారు చేస్తున్నాం : పార్థసారథి

By

Published : Apr 18, 2019, 5:44 PM IST

Updated : Apr 18, 2019, 8:53 PM IST

రైతులకు సంబంధించిన భూ వివరాలతో పాటు పంటలు, వ్యవసాయ పరికరాలు, ఆధార్ సంఖ్యతో, చారవాణి నెంబర్​లతో భారీ డేటా బేస్​ను తయారు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. సాంకేతికతను సమకూర్చుకుని దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ "కీ" ని తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్​పై జాతీయ సదస్సు
Last Updated : Apr 18, 2019, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details